'ఉప్పెన'తో సక్సెస్ కొట్టిన వైష్ణవ్ తేజ్ నటించిన రెండో చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించారు. పవన్‌కల్యాణ్‌తో క్రిష్ సినిమాను తెరకెక్కిస్తున్న సమయంలో కోవిడ్ ప్రభావం ప్రారంభమైంది. అప్పుడు సినిమా షూటింగ్‌ను ఆపారు. తర్వాత షూటింగ్స్ చేసుకోవడానికి కొన్ని నియమాలను పెట్టి ప్రభుత్వం అనుమతులను ఇచ్చింది. ఆ సమయంలో పవన్‌కల్యాణ్ సినిమాను స్టార్ట్ చేయడానికి కాస్త సమయం పట్టింది. ఆ గ్యాప్‌లో పవన్‌కల్యాణ్ మేనల్లుడు, మెగా హీరో అయిన వైష్ణవ్ తేజ్‌తో ఓ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ క్రిష్. ఈ చిత్రంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటించింది. పక్కా ప్లానింగ్‌తో తక్కువ రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేశాడు డైరెక్టర్ క్రిష్. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమాకు 'జంగిల్ బుక్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. త్వరలోనే ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారు. కొండ మీద నివాసం ఉండే ఓ గ్రామంలోని ప్రజలు అక్కడ వ్యవసాయం చేయడం, అడవుల్లోని జంతులు, వాతావరణం వల్ల వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనే కథాంశంతో సినిమా తెరకెక్కింది. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ హీరోగా విడుదలకానున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.