Abn logo
Sep 27 2021 @ 01:56AM

సానియా జోడీకి టైటిల్‌

ప్రేగ్‌: ఒస్ట్రావా ఓపెన్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ను సానియా మీర్జా-ఝంగ్‌ షాయ్‌ (చైనా) జోడీ గెలుపొందింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత సానియా డబ్ల్యూటీఏ టైటిల్‌ నెగ్గడం విశేషం. చెక్‌ రిపబ్లిక్‌లో ఆదివారం ముగిసిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో సానియా జోడీ 6-3, 6-2తో కైట్లిన్‌ క్రిస్టియన్‌ (అమెరికా)-ఎర్రిన్‌ రౌట్‌లైఫ్‌ (న్యూజిలాండ్‌) ద్వయంపై సునాయాసంగా నెగ్గింది.