Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతులకు మద్దతుగా పాదయాత్ర?

హైదరాబాద్‌: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతులకు మద్దతుగా పాదయాత్ర చేయాలని నిర్ణయించినట్లు కోదండరాం తెలిపారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ ఇందిరాపార్క్‌ దగ్గర అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతు ధర్మాగ్రహ దీక్ష జరిగింది. దీక్షకు కోదండరాం, చాడ వెంకటరెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి, జూలకంటి రంగారెడ్డి, పలువురు సీపీఐ, న్యూ డెమొక్రసీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడతుతూ రైతులకు మద్దతుగా పాదయాత్ర చేయాలని నిర్ణయించామన్నారు. రైతులకు న్యాయంజరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. రెండు రోజుల్లో పాదయాత్ర కార్యాచరణను ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు. 
Advertisement
Advertisement