Abn logo
Sep 11 2021 @ 10:47AM

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకు పోరాడతాం: Kodandaram

హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకు పోరాడతామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. పోడు చట్టాలు, రైతులకు  వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టుల సూచనలను కూడా  ప్రభుత్వాలు పెడ చెవిన పెడుతున్నాయన్నారు. కోవిడ్‌తో జీవనాధారం కోల్పోయిన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలన్నీ పోరాటంలోకి దిగాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలతో మోదీ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారన్నారు. దేశంలో తలెత్తిన ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కోదండరాం వ్యాఖ్యానించారు. 


మోదీ ప్రభుత్వ కార్పోరేట్  విధానాలకు నిరసనగా బంద్‌లో పాల్గొనాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి.  మోదీ పాలనకు వ్యతిరేకంగా ఈనెల‌ 20 నుంచి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీజేఎస్ ఆధ్వర్యంలో తెలంగాణలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈనెల 22న‌ ఇందిరా పార్క్ వద్ద మహాదర్నా, 27న భారత్ బంద్, అక్టోబర్ 5న పోడు రైతులకు మద్దతుగా 400 కిలోమీటర్ల మేర రాస్తారోకోలు నిర్వహించనున్నారు. 

హైదరాబాద్మరిన్ని...