బెంగాల్‌: టీఎంసీ నేత సుజాత మండల్‌పై ఇటుకలతో దాడి

ABN , First Publish Date - 2021-04-06T22:08:44+05:30 IST

అయితే ఈ దాడకి పాల్పడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలేనని టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన మహిళా నేతను లక్ష్యంగా చేసుకుని కావాలనే ఈ దాడకి పాల్పడ్డారని

బెంగాల్‌: టీఎంసీ నేత సుజాత మండల్‌పై ఇటుకలతో దాడి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత సుజాత మండల్‌పై కొంత మంది కర్రలతో, ఇటుకలతో దాడికి దిగారు. పోలింగ్ బూత్ నుంచి ఆమెను కొంత దూరం వరకు వెంటబడి తరిమారు. తీవ్ర భయాందోళనకు గురైన ఆమె పరుగులు అందుకున్నారు. మూడో దశ పోలింగ్‌లో భాగంగా మంగళవారం రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇంతలో ఆరంబాఘ్‌లో టెఎంసీ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు మధ్య వివాదం తలెత్తింది. ఇంతలోనే కొంత మంది గుంపు సుజాత మండల్‌వైపు కర్రలు, ఇటుకలతో దాడికి ప్రయత్నించారు.


అయితే ఈ దాడకి పాల్పడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలేనని టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన మహిళా నేతను లక్ష్యంగా చేసుకుని కావాలనే ఈ దాడకి పాల్పడ్డారని, ఆరంబాఘ్‌లో వివాదానికి కారణం కూడా బీజేపీయేనని ఆమె విమర్శలు గుప్పించారు. సుజాత మండల్‌పై తలపై గాయాలయ్యాయని టీఎంసీ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను టీఎంసీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు.



Updated Date - 2021-04-06T22:08:44+05:30 IST