దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన తృణమూల్.. ఉపాధ్యక్షురాలిగా శతాబ్ది

ABN , First Publish Date - 2021-01-17T22:01:12+05:30 IST

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీపై అసంతృప్త బావుటా ఎగరవేస్తుండటంతో తృణమూల్ అధిష్ఠానం ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు

దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన తృణమూల్.. ఉపాధ్యక్షురాలిగా శతాబ్ది

కోల్‌కతా : ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీపై అసంతృప్త బావుటా ఎగరవేస్తుండటంతో తృణమూల్ అధిష్ఠానం ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. తాజాగా అసమ్మతి స్వరం వినిపించిన ఎంపీ శతాబ్ది రాయ్‌ని పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమిస్తున్నట్లు అధిష్ఠానం ప్రకటించింది. శతాబ్ది రాయ్‌తో పాటు మోజెమ్ హుస్సేన్, శంకర్ చక్రవర్తిని కూడా ఉపాధ్యక్షులుగా నియమిస్తున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. తమ పార్టీలోనే తనకు కొన్ని సమస్యలున్నాయని, దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని శతాబ్ది కొన్ని రోజుల క్రితం సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా కేంద్ర హోంమంత్ర షాతో భేటీ అవుతున్నట్లు కూడా ప్రకటించారు. అయితే టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీతో సమావేశం తర్వాత శతాబ్ది యూటర్న్ తీసుకున్నారు. తాను టీఎంసీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకునే తృణమూల్ ఆమెను ఉపాధ్యక్షురాలిగా నియమించింది. అయితే బీర్బూమ్ అధ్యక్షుడు అనుబాత్రా మండల్‌తో ఆమెకు తీవ్రంగా విభేదాలున్నాయి. 

Updated Date - 2021-01-17T22:01:12+05:30 IST