రెబల్ నేత సువేందు అధికారికి తలుపులు మూసేసిన టీఎంసీ

ABN , First Publish Date - 2020-12-04T00:55:32+05:30 IST

గతవారం మమత బెనర్జీ కేబినెట్ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన రెబ్ నేత సువేందు అధికారికి టీఎంసీ తలుపులు మూసిసింది

రెబల్ నేత సువేందు అధికారికి తలుపులు మూసేసిన టీఎంసీ

కోల్‌కతా: గతవారం మమత బెనర్జీ కేబినెట్ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన రెబల్ నేత సువేందు అధికారికి టీఎంసీ తలుపులు మూసిసింది. పార్టీలో సువేందు అధికారి ‘అధ్యాయం ముగిసింద’ని టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ పేర్కొన్నారు. ఉన్నత స్థాయి సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు వ్యతిరేకంగా సువేందు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సౌగత్ రాయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.  వచ్చే ఏడాది రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్‌ను టీఎంసీ తమ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంది. అయితే, పార్టీలో ప్రశాంత్ కిశోర్ పనితీరును కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్త అని, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదని సౌగత్ రాయ్ హితవు పలికారు.


టీఎంసీ ఎమ్మెల్యేలు పార్టీని విమర్శిస్తున్నారని, వారు ప్రశాంత్ కిశోర్‌కు వ్యతిరేకంగా కానీ, దీదీ(మమత బెనర్జీ)కి వ్యతిరేకంగా కానీ మాట్లాడితే.. పోరాడి గెలిచేందుకు తమకు కావాల్సినంతమంది విధేయులు ఉన్నారని ఎంపీ పేర్కొన్నారు. కాగా, మాస్ ఫాలోయింగ్ కలిగిన సువేందు అధికారి గతవారం తన మంత్రి పదవితోపాటు ఇతర పదవులకు రాజీనామా చేశారు. 

Updated Date - 2020-12-04T00:55:32+05:30 IST