ఉద్యోగాల హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి : టీఎంసీ

ABN , First Publish Date - 2021-08-01T23:18:26+05:30 IST

నిరుద్యోగులకు ఇచ్చిన హామీని ప్రధాన మంత్రి నరేంద్ర

ఉద్యోగాల హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి : టీఎంసీ

కోల్‌కతా : నిరుద్యోగులకు ఇచ్చిన హామీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివారం కోల్‌కతాలో టీఎంసీ ధర్నా నిర్వహించింది. 


టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల బ్యాంకు ఖాతాలకు రూ.15 లక్షల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చిందని చెప్పారు. నిరుద్యోగులకు 4 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందన్నారు. ఈ హామీలను నెరవేర్చాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 


రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు శనివారం ప్రకటించిన బాబుల్ సుప్రియో గురించి ప్రస్తావిస్తూ, ఆయన బీజేపీ కార్యాలయం వద్ద టీ అమ్ముకోవచ్చునని మదన్ మిత్రా ఎద్దేవా చేశారు. 


బాబుల్ సుప్రియో 2014లో బీజేపీలో చేరారు. కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రిగా చేశారు. ఇటీవల మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. 


Updated Date - 2021-08-01T23:18:26+05:30 IST