Abn logo
Sep 23 2021 @ 20:16PM

అందుకే టీఎంసీ మావైపు చూస్తోంది: సువేందు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదని, అందుకే భారతీయ జనతా పార్టీ నేతల వైపు చూస్తన్నారని బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి అన్నారు. రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీ నేతలు టీఎంసీ గూటికి వెళ్తున్నారు. దీనికి కారణం టీఎంసీలో నాయకత్వ లోపం ఉందని, అందుకే బీజేపీ వైపు చూస్తున్నారని సువేందు ఎద్దేవా చేశారు.


‘‘బీజేపీ నేతలను టీఎంసీలోకి లాక్కుంటున్నారు. ఎంత మందిని లాక్కుంటారో లాక్కోనివ్వండి. ఎందుకంటే టీఎంసీలో నాయకత్వ లోపం ఉంది. బీజేపీ నుంచి తీసుకున్నవాళ్లతోనైనా బలపడనివ్వండి. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో స్వతంత్ర వ్యక్తులు ఎలాంటి ప్రభావం చూపలేరు. సనాతన ఓట్లు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓటర్లు బీజేపీవైపే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభావం వీరిపై ఉంటుంది. మోదీ మినహా మరెవరూ వారిని ప్రభావితం చేయలేరు’’ అని సువేందు అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption