నారద టేపుల కేసులో టీఎంసీ నేతల

ABN , First Publish Date - 2021-05-10T13:34:59+05:30 IST

నారద టేపుల వ్యవహారంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అగ్ర నేతలు ఫిర్హద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీ, మదన్‌ మిత్రా,

నారద టేపుల కేసులో టీఎంసీ నేతల

విచారణకు గవర్నర్‌ అనుమతి

కోల్‌కతా, మే 9: నారద టేపుల వ్యవహారంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అగ్ర నేతలు ఫిర్హద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీ, మదన్‌ మిత్రా, సోవన్‌ చటర్జీల విచారణకు పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌ అనుమతి ఇచ్చారు. సీబీఐ చేసిన విజ్ఞప్తి  మేరకు గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు. 2014లో నారద వార్తా సంస్థకు చెందిన మాథ్యూ శామ్యూల్‌ అనే వ్యక్తి ఈ టేపులను రహస్యంగా చిత్రీకరించగా.. 2016లో ఇవి వెలుగులోకి వచ్చాయి. ఓ బూటకపు కంపెనీ ప్రతినిధుల నుంచి టీఎంసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటున్న దృశ్యాలు ఈ టేపుల్లో కనిపించాయి. ఫిర్హద్‌ హకీం, సుబ్రతా, మదన్‌, సోవన్‌లు కూడా వారిలో ఉన్నారు. 2014లో ఈ టేపులను చిత్రీకరించినపుడు ఈ నలుగురూ మమత కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు. ఈ వ్యవహారంలో ఆ నలుగురి విచారణకు అనుమతి ఇవ్వాలని ఆదివారం సీబీఐ అధికారులు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారని, అందుకు గవర్నర్‌.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 163, 164 ద్వారా తనకు సంక్రమించిన అధికారాలను వాడుకొని సీబీఐ విచారణకు అనుమతించారని రాజ్‌భవన్‌ కార్యాలయ అధికారులు తెలిపారు. కాగా ఈ కేసులో కలకత్తా హైకోర్టు 2017లో విచారణకు ఆదేశించింది.

Updated Date - 2021-05-10T13:34:59+05:30 IST