సీబీఐ, ఈడీ అధికారులపై అసెంబ్లీలో హక్కుల తీర్మానం

ABN , First Publish Date - 2021-11-17T22:11:23+05:30 IST

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చెందిన ఇద్దరు అధికారులపై ..

సీబీఐ, ఈడీ అధికారులపై అసెంబ్లీలో హక్కుల తీర్మానం

కోల్‌కతా: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చెందిన ఇద్దరు అధికారులపై హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టారు. నారదా స్టింగ్ కేసులో స్పీకర్‌కు సమాచారం ఇవ్వకుండా ముగ్గురు టీఎంసీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసినందుకు గాను ఈ హక్కుల తీర్మానం ఇచ్చారు.


టీఎంసీ ఎమ్మెల్యే, మంత్రి తపస్ రాయ్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. నారదా కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యేలైన ఫిర్హద్ హకిం, మదన్ మిత్రా, సుబ్రత ముఖర్జీలను ఈ ఏడాది ప్రారంభంలో సీబీఐ అరెస్టు చేసిందని, అయితే ఇందుకు స్పీకర్ అనుమతి తీసుకోవడం కానీ, కనీసం ఆయనకు సమాచారం ఇవ్వడం కానీ చేయలేదని ఈ సందర్భంగా తపన్‌ రాయ్ పేర్కొన్నారు. సీబీఐ అరెస్టు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది.

Updated Date - 2021-11-17T22:11:23+05:30 IST