తృణమూల్ ఎంపీ సుస్మితాదేవ్ కారుపై బీజేపీ కార్యకర్తల దాడి

ABN , First Publish Date - 2021-10-22T21:35:23+05:30 IST

త్రిపురలో పాగా వేయాలని చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అక్కడ 2023లో జరగనున్న శాసనసభ

తృణమూల్ ఎంపీ సుస్మితాదేవ్ కారుపై బీజేపీ కార్యకర్తల దాడి

అగర్తల: త్రిపురలో పాగా వేయాలని చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అక్కడ 2023లో జరగనున్న శాసనసభ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రెడీ అవుతోంది. అందులో భాగంగా ‘త్రిపురార్ జొన్నో తృణమూల్’ పేరుతో ప్రచారం ప్రారంభించింది. త్రిపురలో తృణమూల్ వ్యవహారాలను చూసుకుంటున్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు నేడు ప్రచార కార్యక్రమ సమయంలో ఉన్న సమయంలో బీజేపీ కార్యకర్తలు ఆమె కారుపై దాడికి పాల్పడ్డారు. 


ప్రచారంలో పాల్గొన్న మిగతా వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో స్వల్పంగా గాయపడిన సుస్మిత  పశ్చిమ త్రిపుర జిల్లాలోని అమ్తులి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుస్మితతోపాటు త్రిపురలో టీఎంసీ కోసం పనిచేస్తున్న ఐ-ప్యాక్ సభ్యులపైనా బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని, వారి ఫోన్లను ఎత్తుకెళ్లారని  టీఎంసీ ఆరోపించింది. తృణమూల్ కాంగ్రెస్ ఉనికిని త్రిపుర సీఎం బిప్లబ్ దేబ్ భరించలేకపోతున్నారని మరోమారు రుజువైందని మండిపడింది. ప్రతిపక్షాలపై ఈ దాడులు ఎప్పటికి ఆగుతాయని ప్రశ్నించింది.

Updated Date - 2021-10-22T21:35:23+05:30 IST