బీజేపీ గెలుస్తుందంటూ నోరుజారిన ముకుల్‌రాయ్

ABN , First Publish Date - 2021-08-07T21:30:42+05:30 IST

బీజేపీ టిక్కెట్‌పై కృష్ణానగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇటీవల గెలిచి, ఆ తర్వాత మళ్లీ..

బీజేపీ గెలుస్తుందంటూ నోరుజారిన ముకుల్‌రాయ్

కోల్‌కతా: బీజేపీ టిక్కెట్‌పై కృష్ణానగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇటీవల గెలిచి, ఆ తర్వాత మళ్లీ టీఎంసీలో చేరిపోయిన ముకుల్‌రాయ్ తడబడ్డారు. పశ్చిమబెంగాల్‌లో జరుగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆ వెంటనే తన పొరపాటును సరిదిద్దుకుంటా...తన ఉద్దేశం టీఎంసీ గెలుస్తుందని చెప్పడమేనంటూ వివరణ ఇచ్చారు. కమలం పార్టీ గెలుస్తుందంటూ ముకుల్‌రాయ్ చెప్పడాన్ని బీజేపీ స్వాగతించింది. కాకతాళీయంగా అన్నప్పటికీ ఆయన నిజమే చెప్పారని వ్యాఖ్యానించింది.


ముకుల్‌రాయ్ తన నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా టీఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ''అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది. త్రిపురలోనూ గెలుస్తుంది. అందులో అనుమానమే లేదు"అని ఆయన తొలుత వ్యాఖ్యానించారు. ఆయన మాటలకు ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి చెందటంతో ఆయన ఉలిక్కిపడ్డారు. వెంటనే తన పొరపాటును సవరించుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నిస్సందేహంగా ఉప ఎన్నికల్లో గెలుస్తుందని, బీజేపీ ఓటమి చవిచూస్తుందని అన్నారు. బెంగాల్‌లోనే కాకుండా త్రిపురలోనూ టీఎంసీ ఖాతా తెరుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


ముకుల్‌రాయ్ వంచించారు...

కాగా, ముకుల్ రాయ్ కృష్ణానగర్ నార్త్ ఓటర్లను వంచించారని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. ఆయన విశ్వసనీయతను కోల్పోయారని తప్పుపట్టారు. తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నందునే బీజేపీ గెలుస్తుందనే నిజం ఆయన నోటి నుంచి వచ్చిందన్నారు.

Updated Date - 2021-08-07T21:30:42+05:30 IST