Abn logo
Oct 30 2020 @ 14:41PM

మెడికల్ అడ్మిషన్లలో 7.5 శాతం కోటాకు గవర్నర్ అనుమతి

చెన్నై: తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి నీట్ అడ్మిషన్లలో క్వాలిఫై అయిన విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశానికి 7.5 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ శుక్రవారంనాడు ఆమోదముద్ర వేశారు. తమిళనాడు గవర్నమెంట్ స్కూల్స్ బిల్లు 2020 బిల్లు ప్రకారం ప్రాధాన్యతా క్రమంలో మెడిసన్, డెంటిస్ట్రీ, ఇండియన్ మెడిసన్, హోమియోపతిలో (అండర్ గ్యాడ్యుయేట్ కోర్సులు) ప్రవేశానికి గవర్నర్ అనుమతించారని రాజ్‌భవన్ ఒక అధికార ప్రకటనలో తెలిపింది.

ఆరవ తరగతి నుంచి 12వ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, నీట్ అర్హత సంపాందించిన వారికి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లలో 7.5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఒక జీవో జారీ చేసింది. దీనిపై సెప్టెంబర్ 26న భారత ప్రభుత్వ సొలిసిటర్ జనరల్‌ను అభిప్రాయాన్ని గవర్నర్ కోరారని, ఎస్‌జీ అభిప్రాయం అందడంతో బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారని రాజ్‌భవన్ ఆ ప్రకటనలో తెలిపింది.

Advertisement
Advertisement
Advertisement