Abn logo
May 22 2020 @ 11:34AM

బుల్లితెర షూటింగ్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌..నింబంధనలు

తమిళనాడులో బుల్లితెర షూటింగ్‌లకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక నిబంధనలతో, కొన్ని షరతులతో టీవీ సీరియల్స్‌, కార్యక్రమాలకు సంబంధించిన షూటింగ్‌లు జరుపుకు నేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిషేధాజ్ఞల కారణంగా యాభై రోజులకు పైగా సినిమాలు, టీవీ సీరియల్స్‌, టీవీ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన షూటింగ్‌లు ఆగిపోయాయి. ఈ పరిస్థితుల్లో దక్షిణ భారత సినీ కార్మికుల సమ్మేళనం (పెప్సీ), దక్షిణ భారత బుల్లితెర నిర్మాతల సంఘం (స్టెప్స్‌) షూటింగ్‌లు జరుపుకునేందుకు అనుమతివ్వాలని ముఖ్యమంత్రి ఎడప్పాడిని కోరారు. ఆ మేరకు ముందుగా సినిమాలకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు జరుపుకునేందుకు ఇటీవల సీఎం అనుమతినిచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం బుల్లి తెర షూటింగ్‌లకు అనుమతి మంజూరు చేస్తూ ఓ ప్రకటన జారీ చేశారు. 


నిబంధనలు...


1 నాలుగు గోడల మధ్య ఇళ్లలో లేదా స్టూడియోలో (ఇండోర్‌) షూటింగ్‌ జరుపుకోవచ్చు.  కంటైన్‌మెంట్‌ జోన్లలో షూటింగ్‌లకు అనుమతి లేదు.

2 జనం అధికంగా గుమికూడే ప్రాంతాల్లో షూటింగ్‌కు అనుమతి లేదు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఔట్‌డోర్‌ షూటింగ్‌ జరుపుకోవచ్చు.  

3 షూటింగ్‌ ప్రదేశాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో సందర్శకులను అనుమతించకూడదు.

4 షూటింగ్‌ జరిగే ఫ్లోర్‌, లేదా ఇళ్లలో షూటింగ్‌కు ముందు తర్వాత క్రిమినాశని మందు చల్లి శుభ్రంగా ఉంచాలి.

5 షూటింగ్‌లో పాల్గొనే నటీనటులు తప్ప మిగిలిన సాంకేతిక బృందం అంతా విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. షూటింగ్‌ విరామ సమయాల్లో నటీనటులు కూడా  మాస్కులు ధరించాలి.

6 షూటింగ్‌ యూనిట్‌ సభ్యులంతా తరచూ సబ్బునీళ్లతోగానీ, శానిటైజర్‌తోగానీ చేతులను శ్రుభం చేసుకోవాలి.

7 షూటింగ్‌ స్పాట్‌కు వచ్చే వాహనాలన్నిం టిపైనా క్రిమినాశని మందు పిచికారీ చేయించాలి. అదే విధంగా షూటింగ్‌కు ఉపయోగించే కెమెరా, క్రేన్‌ తదితర పరికరాలను కూడా తరచూ క్రిమినాశని మందులతో శుభ్రం చేయాలి.

8 జలుబు, దగ్గు, జ్వరం ఉన్న నటీనటులను, సాంకేతిక సిబ్బందిని షూటింగ్‌ స్పాట్‌లోకి అనుమతించకూడదు. ఆ లక్షణాలున్న వారిని తక్షణమే వైద్య పరీక్షలకు పంపాలి.

9 షూటింగ్‌ స్పాట్‌లో నటీనటులు, సాంకేతిక కళాకారులు సహా అధికపక్షంగా 20 మందికి మించకుండా కట్టుదిట్టం చేసుకోవలి.

10 చెన్నైలో షూటింగ్‌కు కార్పొరేషన్‌ కమిషనర్‌ వద్ద, ఇతర జిల్లాలో సంబంధిత జిల్లా కలెక్టర్ల వద్ద అనుమతి తీసుకోవాలి.

11 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తరచూ విధించే నిబంధనలు, షరతులకు లోబడి షూటింగ్‌లు జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను తుచ తప్పకుండా పాటిస్తున్నట్లు ప్రభుత్వానికి నిర్మాతలు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement
Advertisement