కరోనా ఎఫెక్ట్.. తమిళనాడు కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2021-08-02T05:13:01+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో కొద్ది రోజుల క్రితం వరకు పరిస్థితులు బాగానే.. తాజాగా మళ్లీ కొన్ని రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు కీ

కరోనా ఎఫెక్ట్.. తమిళనాడు కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో కొద్ది రోజుల క్రితం వరకు పరిస్థితులు బాగానే.. తాజాగా మళ్లీ కొన్ని రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు పెద్ద మొత్తంలో నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో కేరళ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేరళ నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ తమిళనాడు నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు ఈ నెల 5 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. వరుసగా ఐదో రోజు శనివారం కూడా కేరళలో 20వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.  


Updated Date - 2021-08-02T05:13:01+05:30 IST