Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేతనాలు అందేలా చూస్తాం: టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్‌

హైదరాబాద్: రాష్ట్రంలోని ఉద్యోగులకు వేతనాలు అందేలా చూస్తామని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో బిల్లుల సమర్పణలో జాప్యంతో వేతనాలు ఆతస్యంగా వస్తున్నాయని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారని ఆయన తెలిపారు. ట్రేజరీశాఖ నిర్దేశించిన తేదీల్లోపే బిల్లులు సమర్పించాలన్నారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందుల మాట వాస్తవమన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నవా, లేవా అనే విషయం ఆర్థికశాఖ అధికారులు చెప్పాలన్నారు. మాకు రావాల్సి ఉంటే ప్రభుత్వాన్ని అడుగుతామన్నారు.


ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిని కలిసి ఉద్యోగులకు వేతనాలు అందేలా చూస్తామన్నారు. కొన్ని జిల్లాల్లో దశలవారీగా వేతనాలు ఇస్తున్న మాట వాస్తవమేనన్నారు. రాష్ట్రంలో పెన్షనర్లు చాలా మంది ఉన్నారని, ముందు వారికి డబ్బులు ఇవ్వాలని కోరామని రాజేందర్‌ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement