తాటియాకులగూడెం చెక్‌పోస్టు వద్ద సౌకర్యాలు నిల్‌

ABN , First Publish Date - 2020-10-28T08:02:53+05:30 IST

రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు తాటియాకులగూడెం వద్ద సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది.

తాటియాకులగూడెం చెక్‌పోస్టు వద్ద సౌకర్యాలు నిల్‌

కన్పించని విద్యుత్‌ దీపాలు, సిబ్బందికి తప్పని అవస్థలు 


జీలుగుమిల్లి, అక్టోబరు 27 : రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు తాటియాకులగూడెం వద్ద సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. ఇటీవల జిల్లా ఉన్నతాధికారులు సరిహద్దు నుంచి తెలంగాణ మద్యం, ఇసుక తరలింపు విషయమై ఎటువంటి అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన జీలుగుమిల్లి మండలంలో కామయ్య పాలెం, తాటియాకులగూడెం, రాచన్నగూడెం, లంకాలపల్లి  ప్రాంతాల్లో  24 గంటలపాటు వంతుల వారీగా పోలీస్‌ నిఘా ఉంచింది. వారి పర్యవేక్షణకు ఉన్నతస్థాయి అధికారులు ఉన్నారు. కొన్ని చెక్‌పోస్టుల్లో  సిబ్బంది విధులు నిర్వహించేందుకు రాత్రి సమయంలో ఇబ్బందులకు గురి కావాల్సివస్తోంది. ఎస్‌ఈబీ చెక్‌పోస్టుల వద్ద ఎటువంటి విద్యుత్‌  కాంతులు లేకుండా ప్రాణాలకు తెగించి పోలీస్‌ ఎస్‌పీవోలు విధులు నిర్వహించాల్సి వస్తోంది.


విద్యుత్‌ సరఫరా లేని చెక్‌పోస్టుల వద్ద ఇన్‌వర్టర్లు ఏర్పాటు చేస్తే సిబ్బందికి కాస్త వెసులు బాటు కలిగేది.  చెక్‌ పోస్టుల వద్ద సరైన సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలం అవుతున్నారు. విధులు నిర్వహించే సిబ్బంది ఏమాత్రం అలక్ష్యం చేసినా ఉద్యోగాల్ని కోల్పోవాల్సి వస్తోంది. ఇటీవల జీలుగుమిల్లి చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తూ అక్రమ మద్యం పట్టుబడిన కేసులో రిటైర్‌మెంట్‌కు ముందు ఓ ఏఎస్‌ఐ సస్పెండైను  సంఘటనే నిదర్శనం. చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది చీకట్లో విధులు నిర్వహిస్తున్న విషమయైు పోలవరం సీఐ ఎంవీఎస్‌ మూర్తిని వివరణ కోరగా ఇన్‌వర్టర్ల సదుపాయం కల్పించలేదని తెలిపారు. 


కామయ్యపాలెం చెక్‌పోస్ట్‌ వద్ద విషసర్పాలు

కామయ్యపాలెం చెక్‌పోస్టు వద్ద రాత్రి సమయాల్లో విషసర్పాలు వస్తున్నాయని వాటిని చంపుతూ విధులు నిర్వహిస్తున్నామని సిబ్బంది వాపోతున్నారు. ఇటీవల వర్షాలకు చెక్‌పోస్ట్‌ కింద మట్టి కొట్టుకుపోయి ఒక స్తంభంపై నిలబడి ఉంది. రాత్రి సమయంలో విధులు నిర్వహించలేక చాలీచాలని జీతంతో కొందరు ఎస్‌పీవోలు విధులకు డుమ్మా కొట్టారని కొందరు పోలీస్‌ కానిస్టేళ్లు చెబుతున్నారు.

Updated Date - 2020-10-28T08:02:53+05:30 IST