కార్మికుల ఎన్నికల హామీలు నెరవేర్చాలి

ABN , First Publish Date - 2020-10-28T08:17:56+05:30 IST

ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని సీఐటీయూ నాయకులు బి. సోమయ్య, బి.జగన్నాథరావులు డిమాండ్‌ చేశారు.

కార్మికుల ఎన్నికల హామీలు నెరవేర్చాలి

ఏలూరు టూటౌన్‌, అక్టోబరు 27: ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని సీఐటీయూ నాయకులు బి. సోమయ్య, బి.జగన్నాథరావులు డిమాండ్‌ చేశారు. మునిసిపల్‌ కార్మికులు మంగళవారం కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మూడు నెలలుగా బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.


కొవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పాటుపడుతున్న పారిశుధ్య కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడం దారుణమని విమర్శించారు. 11వ పీఆర్‌సీకి అనుగుణంగా జీతాలు పెంచాలన్నారు. స్కూల్‌ స్వీపర్లకు ఫుల్‌టైమ్‌ వేతనాలు ఇవ్వాలన్నారు. కార్మికులకు చెప్పులు, సబ్బులు, కొబ్బరినూనె, యూనిఫాంలు, ఇతర పనిముట్లు అందజేయాలన్నారు. వెంటనే మునిసిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె చేపడాతమని హెచ్చరించారు. కార్యక్రమంలో కెవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కె. రవీంద్ర, ఎ.జాన్‌బాబు, ఎల్‌.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-28T08:17:56+05:30 IST