Abn logo
Oct 30 2020 @ 06:33AM

రాజధాని రైతులకు అండగా ఉద్యమిస్తాం

Kaakateeya

ఏలూరు పార్లమెంటరీ అధ్యక్షుడు గన్ని


భీమడోలు/అత్తిలి,అక్టోబరు 29 :రాజధాని రైతులకు అండగా ఉద్యమాలు  చేస్తామని ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు,మాజీ  ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు హెచ్చరించారు. భీమడోలు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం నిరసన ప్రదర్శన చేసి అధికారులకు విన తిపత్రాన్ని అందజేశారు.రాజధాని రైతులకు బేడీలు వేసి తరలించడం అత్య ంత దుర్మార్గమని అన్నారు.సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అత్యంత తీవ్రమైన కేసుల్లో తప్ప నిందితులకు బేడీలు వేయకూడదనే నిబంధనను పోలీసులు కాలరాశారన్నారు.ఉద్యమాన్ని రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ నేతలు చేస్తున్న దాష్టీకాలకు పోలీసులు వంతపాడడం హేయ నీయ చర్య అన్నారు. దళిత రైతులపై దళిత వ్యతిరేక చట్టాలతో కేసులు పెట్టడం వైసీపీ ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమన్నారు.రాజధాని పోరాటాన్ని నిర్వీర్యం చేసేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. అత్తిలిలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు ఆందోళన చేశారు.

Advertisement
Advertisement