Abn logo
Oct 30 2020 @ 06:35AM

టెక్స్‌టైల్స్‌ కార్మికుడి మృతిపై కేసు నమోదు

తణుకురూరల్‌, అక్టోబరు 29 : వెంకట్రాయపురం  అక్కమాంబ టెక్స్‌టైల్స్‌ ఫ్యాక్టరీ కార్మికుడు మద్దాల శ్రీనివాస్‌(50) ఆకస్మిక మృతిపై పోలీ సులు కేసు నమోదు చేశారు. విధులు నిర్వహిస్తూ బుధవారం శ్రీనివాస్‌ ఫ్యాక్టరీ ఆవరణలో ఆకస్మికంగా మృతిచెందాడు. ఈ మేరకు ఫ్యాక్టరీ యాజమాన్యం తణుకు రూరల్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గురువారం శవ పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అందజేశారు.ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు, టెక్స్‌టైల్స్‌ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఉపాధ్యక్షుడు కోనాల భీమారావు, కార్యదర్శి కనకారావు, కురెళ్ళ శ్రీనివాస్‌, పెద్దిరాజు, శ్రీనివాస్‌ తదితరులు సంతాపం తెలిపారు. 

Advertisement
Advertisement