Abn logo
Oct 30 2020 @ 06:36AM

పెద్దావిడ జానకమ్మ ఇకలేరు

తణుకురూరల్‌/అత్తిలి, అక్టోబరు 29 : ఐదు తరా లకు చెందిన పెద్దావిడ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.అత్తిలి మండలం ఉరదాళ్ళపాలెం గ్రామానికి చెందిన బొబ్బిలి సత్యనారాయణ సతీమణి జానకమ్మ (94) గురువారం మరణించారు.ఆమెకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. 15 మంది మనుమలు, 17 మంది మునిమనుమలు,ఐదుగురు ఇనిమనుమలు ఉన్నారు. మొత్తం 68 మంది కుటుంబ సభ్యులతో ఆమె ఇంట ప్రతీ ఏటా సంక్రాంతి పండుగను కోలాహలంగా చేసుకునేవారు. అభినందన మీడియా సర్వీసెస్‌ అధినేతలైన అడ్డగర్ల వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ, లక్ష్మణరావులకు మేనత్త.

Advertisement
Advertisement