విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం

ABN , First Publish Date - 2021-06-15T07:42:00+05:30 IST

విద్యార్థుల భవిష్యత్తు, ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు వీ ప్రణయ్‌కుమార్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం
నిరసన తెలుపుతున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నిరసన

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జూన్‌ 14: విద్యార్థుల భవిష్యత్తు, ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు వీ ప్రణయ్‌కుమార్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద సోమవారం పీపీఈ కిట్లు ధరించి నిరసన తెలిపారు. ప్రణయ్‌ మాట్లాడుతూ కరోనా సమయంలో  రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల పేరుతో విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెంచుతోందని విమర్శించారు. ఇప్పటికైనా మెండి వైఖరిని వీడి పది, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింతగా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి పీ నవీన్‌, రామకృష్ణ, నితిన్‌, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T07:42:00+05:30 IST