నిరుపయోగంగా దర్శనిమిస్తున్న హైలెవల్‌ట్యాంకు

ABN , First Publish Date - 2022-01-20T04:41:13+05:30 IST

దొనకొండ పంచాయతీ ప్రజల దాహార్తి తీర్చేందుకు మంజూరైన పైలెట్‌ ప్రాజెక్ట్‌ బొట్టు నీటి సరఫరాకు నోచుకోక నిరుపయోగమైంది. దొనకొండ పంచాయతీ ప్రజల మంచినీటి సమస్యను అధిగమించేందుకు 2003 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో పైలెట్‌ ప్రాజెట్‌ కింద రూ.42.50 లక్షల నిధులు మంజూరు చేశారు. అప్పటి సర్పంచ్‌ నేతృత్వంలో కార్ప్‌సఫండ్‌గా ప్రజల నుంచి కొంత వసూలు చేశారు. పఽథకాన్ని అప్పటి జడ్పీ చెర్మన్‌ ముక్కు కాశిరెడ్డి, ఒంగోలు ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఎన్‌.పాపారావు తదితరులతో ఆర్భాటంగా శంకుస్థాపన చేయించారు.

నిరుపయోగంగా దర్శనిమిస్తున్న హైలెవల్‌ట్యాంకు

 నిరుపయోగంగా నీటి పథకం 

రూ. 42.50లక్షల నిధులు వృధా 

నేటికీ ప్రజలకు తప్పని ఇక్కట్లు

దొనకొండ, జనవరి 19 : దొనకొండ పంచాయతీ ప్రజల దాహార్తి తీర్చేందుకు మంజూరైన పైలెట్‌ ప్రాజెక్ట్‌ బొట్టు నీటి సరఫరాకు నోచుకోక నిరుపయోగమైంది. దొనకొండ పంచాయతీ ప్రజల మంచినీటి సమస్యను అధిగమించేందుకు 2003 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో పైలెట్‌ ప్రాజెట్‌ కింద రూ.42.50 లక్షల నిధులు మంజూరు చేశారు. అప్పటి సర్పంచ్‌ నేతృత్వంలో కార్ప్‌సఫండ్‌గా ప్రజల నుంచి కొంత వసూలు చేశారు. పఽథకాన్ని అప్పటి జడ్పీ చెర్మన్‌ ముక్కు కాశిరెడ్డి, ఒంగోలు ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఎన్‌.పాపారావు తదితరులతో ఆర్భాటంగా శంకుస్థాపన చేయించారు. సర్పంచ్‌ ఎస్‌ఏ గఫూర్‌ నేతృత్వంలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేసి గుత్తేదారు ద్వారా పనులు ప్రారంభించారు. పనుల్లో భాగంగా వీవీపురంలో హైలెవల్‌ వాటర్‌ట్యాంక్‌, ఎంపీడీవో కార్యాలయ సమీపంలో రెండు పంప్‌హౌ్‌సలు, డీప్‌బోర్లు గ్రామంలోని పలు ప్రాంతాల్లో పైప్‌లైన్‌ పనులు దాదాపు 75శాతం పూర్తిచేశారు. చేపట్టిన పనుల్లో నాణ్యత కొరవడిందని కొందరు విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు వచ్చి పనులను పరిశీలించి రికార్డులను తీసుకెళ్లారు. దీంతో పథకానికి గ్రహణం పట్టింది.  లక్షలు ఖర్చుచేసి వదిలేయటంతో నాటి నుంచి దొనకొండ ప్రజలు మంచినీటి ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈపైలెట్‌ ప్రాజెక్ట్‌ వినియోగంలో ఉంటే సాగర్‌ జలాలు రాని రోజుల్లో ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా ఎంతో ప్రయోజనకరంగా ఉండేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. పథకంలో భాగంగా ఏర్పాటైన పైప్‌లైన్‌, బోర్లు, విద్యుత్‌ తీగలు తదితర సామగ్రి మాయమైంది. ఇప్పటికైనా సంబందిత అధికారులు పైలెట్‌ప్రాజెక్ట్‌పై దృష్టి సారించి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. 

నీళ్ల ఇబ్బందులు తప్పటం లేదు 

 - మల్లెల రవికుమార్‌, దొనకొండ 

  నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం. పైలెట్‌ ప్రాజెక్టు   వినియోగంలో ఉండి నీటి సరఫరా జరుగుతుంటే నీళ్ల ఇబ్బందులు ఉండేవి కాదు. అధికారులు నిరుపయోగంగా ఉన్న పైలెట్‌ ప్రాజెక్టు పఽథకాన్ని వినియోగంలోకి తెచ్చి ప్రజల నీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలి.

Updated Date - 2022-01-20T04:41:13+05:30 IST