ప్రవర్తన మారాలంటే..!

ABN , First Publish Date - 2021-07-27T05:30:00+05:30 IST

పిల్లలందరూ ఒకేతీరుగా వ్యవహరించారు. ఒక్కొక్కరిదీ ఒక్కోదారి. చుట్టూ ఉన్న సామాజిక వాతావరణం, ఇంటి వాతావరణం పిల్లల మానసిక పెరుగుదలపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది.

ప్రవర్తన మారాలంటే..!

పిల్లలందరూ ఒకేతీరుగా వ్యవహరించారు. ఒక్కొక్కరిదీ ఒక్కోదారి. చుట్టూ ఉన్న సామాజిక వాతావరణం, ఇంటి వాతావరణం పిల్లల మానసిక పెరుగుదలపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలు అల్లరి ఎక్కువగా చేస్తే, కొందరు మాత్రం సైలెంట్‌గా ఉంటారు. ఇలా ఎందుకు ఉంటారో అర్థం చేసుకుంటే వాళ్లను సులువుగా హ్యాండిల్‌ చేయడానికి వీలవుతుంది.


పుట్టుకతో పిల్లలందరూ ఒకేలా ఉండరు. అలాగే ఒక వ్యక్తిత్వంతో ఎవరూ జన్మించరు. ప్రవర్తన అనేది చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వస్తుంది. సోదరుడు లేదా సోదరి, తల్లితండ్రులు, స్కూల్లో స్నేహితులు...ఇలా అందరి సహచర్యంపై ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ప్రవర్తనలో మార్పు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కొందరి పిల్లల జీవితాల్లో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు దాని ప్రభావం బాగా పడుతుంది. వాళ్ల ఆలోచనా ధోరణిని త్వరగా మార్చుకోరు. అలాంటప్పుడు తల్లితండ్రులు సపోర్టుగా ఉండాలి. ప్రవర్తన మార్చుకోవడానికి పిల్లలకు సహకరించాలి. పిల్లలను అదే పనిగా విమర్శించకూడదు. పిల్లలు నడిచే దారి సరిగ్గా లేకపోతే సరైన దారిలోకి మళ్లేలా చూసే బాధ్యత తల్లితండ్రులదే. పిల్లల అభిరుచులు, అవసరాలు ఒకేలా ఉండవు. అందుకే వారికి తగ్గట్టుగా వ్యవహరించాలి. ఏది మంచిది, ఏది చెడు అన్నది వివరించి చెప్పాలి. ఎలా నడుచుకోవాలో విడమరిచి చెబితే తప్పక మారతారు.

Updated Date - 2021-07-27T05:30:00+05:30 IST