నిమిషం లేటైనా నోఎంట్రీ

ABN , First Publish Date - 2020-12-05T06:16:34+05:30 IST

నిమిషం లేటైనా నోఎంట్రీ

నిమిషం లేటైనా నోఎంట్రీ

నేడు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష 

ఒంగోలు విద్య, డిసెంబరు 4: ట్రిపుల్‌ ఐటీల్లో 2020-21 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు మొదటిసారిగా శనివారం పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఇది జరుగుతుంది. విద్యార్థులు ఉద యం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభ సమయానికి నిమిషం లేటుగా వచ్చినా అనుమతించేదిలేదని డీఈవో వి.ఎస్‌.సు బ్బారావు  తెలిపారు. జిల్లాలో ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షకు 7,302మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం 59 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశ్న పత్రాలను 40 పోలీసు స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష నిర్వహణలో కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఒక్కో గదికి కేవలం 16మందినే కేటాయించాలని డీఈవో ఆయా కేంద్రాల చీఫ్‌లు, డీవోలను ఆదేశించారు. విద్యార్థులు హాల్‌ టిక్కెట్‌తోపాటు, ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తీసు కురావాలి. మొబైల్‌ ఫోన్లు, వాచ్‌, కాలుక్యులేటర్లు, ఇతర పరికరాలు తీసుకురాకూడదు. అంధ విద్యార్థులకు సహాయకులుగా 9వతరగతి విద్యార్థులను నియమించి పరీక్ష రాయించాలి. విద్యార్థులు జవాబులను బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌పాయింట్‌ పెన్నుతో మాత్రమే బబుల్‌ చేయాలని డీఈవో తెలిపారు. 

Updated Date - 2020-12-05T06:16:34+05:30 IST