ఇళ్లు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-09-29T05:53:11+05:30 IST

మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు ప్రాం తాల్లోని ప్రభుత్వ, సింగరేణి స్థలాల్లో గత కొన్నేళ్లుగా ఇళ్లు నిర్మించుకుని స్ధిరపడ్డ వారికి ప్రభుత్వం పట్టాలు

ఇళ్లు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇవ్వాలి

బెల్లంపల్లి, సెప్టెంబరు 28: మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు ప్రాం తాల్లోని ప్రభుత్వ, సింగరేణి స్థలాల్లో గత కొన్నేళ్లుగా ఇళ్లు నిర్మించుకుని స్ధిరపడ్డ వారికి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌తో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో సోమవారం పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ నేత,  ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, బెల్లంపల్లి , మం చిర్యాల ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, దివాకర్‌ విజ్ఞప్తి చేశారు.  జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు అర్బన్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ, సింగరేణి స్థలాల్లో ఎన్నో ఏళ్లుగా ఇండ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారికి పాసుపుస్తకాలు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో వేల మంది నిరుపేదలు ఎన్నో ఏళ్లుగా ఇళ్లుగా నిర్మించుకున్నారని, వీరికి హక్కు పత్రాలను  మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లారు.  సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు రేఖాశ్యాంనాయక్‌, ఆత్రం సక్కు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-29T05:53:11+05:30 IST