Abn logo
May 19 2021 @ 00:00AM

జీర్ణశక్తి పెరగాలంటే...

ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణశక్తి బాగుండాలి. తరువాత మిగిలిన వ్యర్థాలు సరిగ్గా బయటకు వెళ్లాలి.  జీర్ణశక్తి పెరగాలంటే ఇదిగో ఇలా చేయాలి...

  • ఉదయాన్నే ఒక కప్పు నిమ్మరసం తాగాలి. కొన్ని అల్లం ముక్కలకు నిమ్మరసం అద్దుకుంటూ, ఉప్పుతో కలిపి తినాలి. భోజనానికి 15 నిమిషాల ముందు ఇలా తీసుకుంటే డైజెస్టివ్‌ ఎంజైమ్స్‌ స్టిమ్యులేట్‌ అవుతాయి. 
  • సూర్యాస్తమయం కంటే ముందే భోజనం పూర్తిచేయాలి. అది కూడా చాలా తక్కువగా తీసుకోవాలి. సూప్స్‌లాంటివి తీసుకుంటే మరీ మంచిది. డిటాక్స్‌ ప్రక్రియకు ఇది బాగా ఉపకరిస్తుంది.
  • పసుపు, అల్లం, కొత్తిమీర, మిరియాలు, దాల్చినచెక్క, యాలకులు, జాజికాయ, జీలకర్ర... ఈ పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
  • అల్లం టీ లేక అల్లంతో చేసిన ఇతర పానీయాలను తీసుకోవాలి. రాత్రివేళ అల్లం తీసుకుంటే మరీ మంచిది.
  • ఫైబర్‌ ఎక్కువగా లభించే ఆహారపదార్థాలను తీసుకోవాలి. ఫలితంగా మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.
  • రోజూ అరగంటపాటు వాకింగ్‌ చేయాలి. శరీరంలో ఉన్న హానికరపదార్థాలు బయటకు వెళ్లాలంటే నడక తప్పనిసరి. రోజూ కాసేపు యోగాసనాలు వేయండి.
  • రోజూ గోరు వెచ్చని నీళ్లు తాగితే లింఫ్‌ వ్యవస్థ డిటాక్సిఫై అవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జీర్ణశక్తి పెరుగుతుంది. అనారోగ్యం దరిచేరకుండా ఉంటుంది.