చేతులు మృదువుగా ఉండాలంటే..!

ABN , First Publish Date - 2021-03-03T05:48:18+05:30 IST

ఒక పాత్రలో పంచదార, ఆముదం వేసి బాగా కలిపి, తరువాత కొన్ని నిమ్మరసం చుక్కలు వేయాలి. ఈ మిశ్రమంతో అరచేతులను రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చేతుల్లోని మృతకణాలు పోయి చేతులు మృదువుగా మారతాయి

చేతులు మృదువుగా ఉండాలంటే..!

  • ఒక పాత్రలో పంచదార, ఆముదం వేసి బాగా కలిపి, తరువాత కొన్ని నిమ్మరసం చుక్కలు వేయాలి. ఈ మిశ్రమంతో అరచేతులను రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చేతుల్లోని మృతకణాలు పోయి చేతులు మృదువుగా మారతాయి.
  • అరచేతిలో కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌, పంచదార వేసుకుని బాగా రుద్దుకోవాలి. ఆలివ్‌ నూనెలో తేమగుణాలు బాగా ఉంటాయి. పంచదార మంచి స్క్రబ్బర్‌గా పనిచేస్తుంది. దీంతో చేతులు మృదువుగా తయారవుతాయి.
  • రోజుకు రెండుసార్లు చేతులకు వెన్న రుద్దుకుంటే కూడా చేతులు మృదువుగా తయారవుతాయి.
  • వేడి చేసిన పాలు, గ్జిజరిన్‌ రెండిటినీ కలిపి మిశ్రమంలా తయారుచేసుకుని అందులో కొన్ని నిమ్మరసం చుక్కలు వేసి దాంతో అరగంటసేపు చేతులను బాగా మసాజ్‌ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తే చేతులు ఎంతో మృదువుగా అవుతాయి. 
  • ఒక గిన్నెలో గుడ్డు, బాదం పొడి, తేనె వేసి బాగా  కలిపి ఆ మిశ్రమాన్ని అరచేతులకు రాసుకుని పది నిమిషాలు మసాజ్‌ చేయాలి. అలా రోజూ చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • టొమాటో ముక్కలతో అరచేతులను రుద్దుకుంటే చేతులు మృదువుగా అవుతాయి. టొమాటా రసం, నిమ్మరసం, గ్లిజరిన్‌ మిశ్రమాన్ని అరచేతులకు రాసుకున్నా కూడా చేతులు మృదువుగా అవుతాయి. 

Updated Date - 2021-03-03T05:48:18+05:30 IST