సమాచారంలేని సమావేశాలెందుకు?

ABN , First Publish Date - 2022-01-20T05:51:18+05:30 IST

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై గ్రామస్థాయిలో తమకు ఎటువంటి సమాచారం కూడా తెలియడం లేదని, అటువంటప్పుడు గ్రామ, మండల సమావేశాలకు తాము ఎందుకు రావాలని పలువురు సభ్యులు ప్రశ్నించారు.

సమాచారంలేని సమావేశాలెందుకు?
మాట్లాడుతున్న ఎంపీపీ రఘురాం

  గార మండల సమావేశంలో సభ్యుల ప్రశ్న

గార: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై గ్రామస్థాయిలో తమకు ఎటువంటి సమాచారం కూడా తెలియడం లేదని, అటువంటప్పుడు గ్రామ, మండల సమావేశాలకు తాము ఎందుకు రావాలని పలువురు సభ్యులు ప్రశ్నించారు. బుధవారం ఎంపీపీ గొండు రఘురాం అధ్యక్షతన జరిగిన మండల సమావేశంలో సభ్యులు పీస శ్రీహరి, కొయ్యాన నాగభూషణరావుతోపాటు ఎంపీపీ రఘురాం కూడా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇకముందు గ్రామస్థాయిలో అమలుచేస్తున్న వివిధ సంక్షేమపథకాల లబ్ధిదారుల జాబితాలను తమకు తెలియజేయాలని సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయమై మండల ప్రత్యేకాధికారి ప్రసాదరావు మాట్లాడుతూ.. సచివాలయ  నోటీస్‌ బోర్డులో లబ్ధిదారుల వివరాలను, ప్రభుత్వ పథకాల వివరాలను ఉంచాలని ఆదేశించారు.  మండలంలో పలుగ్రామాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలను ఏళ్లతరబడి మార్చకుండా ఉంచారని సభ్యులు  తెలిపారు. అనంతరం వివిధ శాఖల ప్రగతి, సమస్యలపై చర్చించారు. వైస్‌ఎంపీపీలు బరాటం రామశేషు, అరవల శార్వాణి, ఎంపీడీవో ఎస్‌.రామమోహనరావు, ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, పలుశాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీసభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T05:51:18+05:30 IST