ఇంట్లో బ్లాక్‌ ఫంగస్‌ పెరగకుండా...

ABN , First Publish Date - 2021-08-02T05:30:00+05:30 IST

కరోనా కారణంగా బ్లాక్‌ ఫంగస్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఇంట్లో బ్లాక్‌ ఫంగస్‌ పెరగకుండా...

రోనా కారణంగా బ్లాక్‌ ఫంగస్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే ఈ ఫంగస్‌ ఆరోగ్య సమస్యలను కలిగించకుండా ఉండాలంటే, దాని పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని నివారించడంతో పాటు, దాన్ని సమూలంగా తొలగించే చిట్కాల గురించి తెలుసుకోవడం అవసరం. 


పెరిగే ప్రదేశాలు: ఇంట్లో తేమతో కూడిన ప్రదేశాలు (స్నానాల గదులు, పెరడు, అటకలు, పంపులు, వంటింట్లో సింక్‌ దిగువ ప్రదేశం, కుళ్లిన పదార్థాలు)

కలిగించే సమస్యలు: మ్యూకొర్‌మైకోసిస్‌ లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దాంతో పాటు ఈ ఫంగస్‌ వల్ల జుట్టు రాలడం, తలనొప్పి, జ్వరం, కళ్ల దురదలు, ముక్కులో, గొంతులో ఇరిటేషన్‌, అలర్జీ మొదలైన సమస్యలు కూడా తలెత్తుతాయి.


ఇలా కనిపెట్టాలి!

బాత్రూమ్స్‌లో ఎప్పటికప్పుడు తడి ఆరిపోయేలా చూసుకోవాలి.

బాత్రూమ్స్‌లోని టైల్స్‌ గాడుల్లో ఫంగస్‌ పెరుగుతుందేమో గమనిస్తూ ఉండాలి.

ఫంగస్‌ కనిపించిన వెంటనే బ్లీచ్‌తో తుడిచేయాలి.

బ్లీచ్‌, అమ్మోనియా, నిమ్మరసం, బేకింగ్‌ సోడాలను ఫంగస్‌ నిర్మూలనకు ఉపయోగించవచ్చు.


ఇలా నిర్మూలించాలి!

డిహ్యుమిడిఫయర్‌: ఇది రోజుకి గాల్లో కలిసిన 12 లీటర్ల నీటిని గ్రహించగలుగుతుంది.

వెనిగర్‌: దుస్తులకు అంటుకున్న ఫంగస్‌ వదలాలంటే సబ్బు నీళ్లలో వెనిగర్‌ కలిపి వాడాలి.

కర్టెన్లు: ఉప్పు, నిమ్మరసం, వెనిగర్‌ సబ్బు నీళ్లలో కలిపి, కర్టెన్లు నానబెట్టి ఉతకాలి. 

Updated Date - 2021-08-02T05:30:00+05:30 IST