Abn logo
Sep 28 2021 @ 22:29PM

సమయపాలన పాటించకుంటే చర్యలు

రికార్డులను పరిశీలిస్తున్న ఎంపీడీవో భవాని

కోట, సెప్టెంబరు 28 : సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో భవాని హెచ్చరించారు. మండలంలోని గూడలి, చంద్రశేఖర్‌పురం సచివాలయాలను మంగళవారం ఎంపీడీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా సచివాలయాల్లోని రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరుపై ఆరాతీశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా ఉద్యోగులందరూ నిర్ణీత  సమయానికి విధులకు హాజరుకావాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకోవడంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్యదర్శి కిరణ్‌కుమార్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌లు యశ్వంత్‌నాయుడు, వంశీ  ఉన్నారు.