పాత కట్టకు... కొత్త బిల్లు..?

ABN , First Publish Date - 2021-11-22T05:21:25+05:30 IST

గతంలో పోసిన కుంట కట్టకు చెట్లు, చెదారం తొలగించి అధికార పార్టీ చెందిన ఓ నాయకుడు బిల్లు చేయించుకోవడానికి యత్నిస్తున్న విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది.

పాత కట్టకు... కొత్త బిల్లు..?
బుజిలాపురంలో బిల్లు చేయించడానికి ప్రయత్నిస్తున్న కట్ట ఇదే

 అధికార పార్టీ నాయకుడి యత్నం

మోత్కూరు, నవంబరు 21: గతంలో పోసిన కుంట కట్టకు చెట్లు, చెదారం తొలగించి అధికార పార్టీ చెందిన ఓ నాయకుడు బిల్లు చేయించుకోవడానికి యత్నిస్తున్న విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. రై తులు చెబుతున్న వివరాల ప్రకారం... మోత్కూరు మండలం బుజిలాపు రం శివారులోని కుమ్మరికుంటకు కట్ట పోయడానికి, మత్తడి(అలుగు) క ట్టడానికి గతంలో రూ.7 లక్షలు మంజూరయ్యాయి. వాటర్‌షెడ్‌ పథకం లో కట్ట పోశారు. మత్తడి కట్టలేదు. కట్ట పోసినందుకు రూ. 4 లక్షలు ప ని రికార్డు చేసి, అప్పుడు పని చేసిన వారికి చెల్లించారు. మత్తడి నిర్మించనందుకు రూ.3 లక్షలు నిలిపివేశారు. కట్ట పోసి సుమారు రెండేళ్లు అవుతుంది. ప్రస్తుతం అదే కుంట కట్టకు మరమ్మతులు, మత్తడి నిర్మాణానికి మిషనకాకతీయ ఫేజ్‌-4లో రూ.4 లక్షలు మంజూరు చేశారు. ఆ పనులు కాంట్రాక్టు తీసుకున్న అడ్డగూడూరు మండలానికి చెందిన ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడు ఇటీవల ఆ కుంటకట్టకు పెరిగిన చెట్లు, గడ్డి ఎక్స్‌కవేటర్‌తో తొలగించి, కట్ట పోసినట్లుగా బిల్లు చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నార న్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాత కట్టకు కొత్తగా బిల్లు చేసి నిధులు దుర్వినియోగం చేయవద్దని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఫొటో లు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఆ కట్ట వాటర్‌ షెడ్‌లో పోసిందే..

 కేమిడి సైదులు, రైతు, ముశిపట్ల

సుమారు రెండేళ్ల క్రితం కుమ్మరికుంటకు వాటర్‌షెడ్‌లో కట్ట పోశారు. అప్పుడు వాటర్‌ షెడ్‌ ద్వారా ఆ కట్టకు రూ.4 లక్షలు బిల్లు చెల్లించారు. ఇ ప్పుడు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు అదే కట్టకు ఇటీవల మర మ్మతులు చేసి కొత్తగా పోసినట్లుగా బిల్లు చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 

   

మత్తడి కట్టనందున బిల్లు చేయలేదు

 అరుణ్‌కుమార్‌, నీటి పారుదలశాఖ, ఏఈ 

ఆ కట్ట ఇప్పుడే పోశానని కాంట్రాక్టర్‌ చెప్పారు. ఇసుక దొరకక మత్తడి నిర్మించలేదని అన్నారు. మత్తడి కట్ట కడితేనే బిల్లు చేస్తానని, బిల్లు చేయడం లేదు. మరోసారి కట్టను పరిశీలిస్తాను. 


Updated Date - 2021-11-22T05:21:25+05:30 IST