నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేయాలి

ABN , First Publish Date - 2022-01-20T05:14:07+05:30 IST

పురుగు మందు అవశేషాలు లేకుండా నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేయాలని రైతులకు పొగాకు బోర్డు ఆర్‌ఎం జీఎల్‌కే ప్రసాద్‌ సూచించారు.

నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేయాలి
పొగాకు తోటను పరిశీలిస్తున్న అధికారుల బృందం

దేవరపల్లి, జనవరి 19: పురుగు మందు అవశేషాలు లేకుండా నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేయాలని రైతులకు పొగాకు బోర్డు ఆర్‌ఎం జీఎల్‌కే ప్రసాద్‌ సూచించారు. సంగాయిగూడెంలో పొగాకు తోటలు, క్యూరింగ్‌ అయిన పొగాకును పొగాకు బోర్డు ఆర్‌ఎం జీఎల్‌కే ప్రసాద్‌, పొగాకు కొనుగోలు కంపెనీల ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. పొగాకు తోటలో పిలక సకాలంలో తొలగించాలని, పురుగు మందులను పిచికారి చేయకూడదన్నారు.  కార్యక్రమంలో ఐటీసీ, పోలిశెట్టి, జీపీఐ ప్రతినిధులు, రైతులు కరుటూరి శ్రీనివాస్‌, సుంకర రాంబాబు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T05:14:07+05:30 IST