పొగాకు బ్యారన్‌కు అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-01-20T05:55:00+05:30 IST

మండలంలోని ఎన్‌.బయనపల్లి గ్రామంలో పొగాకు బ్యారెన్‌ అగ్ని ప్రమాదానికి గురైంది.

పొగాకు బ్యారన్‌కు అగ్నిప్రమాదం

గిద్దలూరు టౌన్‌, జనవరి 19 : మండలంలోని ఎన్‌.బయనపల్లి గ్రామంలో పొగాకు బ్యారెన్‌ అగ్ని ప్రమాదానికి గురైంది. దొనపాటి వెంకటరామిరెడ్డి అనే రైతుకు చెందిన బ్యారన్‌లో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో  సుమారు రూ.3 లక్షల విలువైన పొగాకు అగ్నికి ఆహుతైంది. అధికారులు గ్రామానికి చేరుకుని మంటలను అదుపుచేసి చుట్టుపక్కలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.

Updated Date - 2021-01-20T05:55:00+05:30 IST