Abn logo
Mar 2 2021 @ 01:24AM

అక్రమంగా తరలిస్తున్న పొగాకు బేళ్లు స్వాధీనం


ఒంగోలు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లా నుంచి గుంటూరుకు అ క్రమంగా తరలుతున్న సుమారు 3 లక్షల విలువైన పొగాకు బేళ్లను పొ గాకు బోర్డు అధికారులు పట్టుకున్నారు. ముం దుగా అందిన సమాచారంతో సోమవారం తెల్లవారుజామున గుం టూరు సమీపంలో పొగాకు బోర్డు విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏపీ27 యూబీ 1416 వాహనంలో పొగాకు తరలుతున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆవి జిల్లాలోని     తా టాకులపాలెం, జమ్ములపాలెం ప్రాంతానికి చెందినవిగా గుర్తించిన విజిలెన్స్‌ అధికారులు వాహనాన్ని, బేళ్లను సీజ్‌ చేశారు. ఈనెల 15 నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానున్నందున రైతులు వేలం కేంద్రాల్లోనే అమ్ముకోవాలని, వ్యాపారులకు ఇలా అక్రమంగా అమ్మరాదని బోర్డు అధికారులు సూచించారు.


Advertisement
Advertisement
Advertisement