నేడు, రేపు హైదరాబాద్‌లో ఉద్యోగ మేళా

ABN , First Publish Date - 2021-05-08T13:06:55+05:30 IST

కరోనా కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారని...

నేడు, రేపు హైదరాబాద్‌లో ఉద్యోగ మేళా

హైదరాబాద్/మన్సూరాబాద్‌ : లైమోన్‌ కన్సల్టెంట్‌ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకుల జాబ్‌మేళాను ఈనెల 8,9 తేదీలలో ఎల్‌బీనగర్‌లోని సితార హోటల్‌ వెనుక జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఖాసీంఖాన్‌ తెలిపారు. కరోనా కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారని, వారికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ, బీటెక్‌, ఐటీ, ఇతర పట్టభద్రులు జాబ్‌మేళాలో పాల్పంచుకోవచ్చన్నారు. వివరాలకు 9154774622 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.

Updated Date - 2021-05-08T13:06:55+05:30 IST