15లోపు నష్టం అంచనా.. 30లోపు పరిహారం
సహాయ శిబిరాల్లో ఉన్నవారికి తలో రూ.500
చిత్తూరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): నివర్బీభత్సానికి గురైన చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలను సీఎం జగన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. శనివారం ఉదయం 9.45 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. 10 నుంచి 11.30 గంటల వరకు తుఫాను కారణంగా మూడు జిల్లాల్లో జరిగిన భారీ నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు.