మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు నేడు సెలవు

ABN , First Publish Date - 2021-03-08T08:08:30+05:30 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు నేడు సెలవు

మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ నిర్ణయం

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మహిళాలోకానికి సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలకపాత్ర అని పేర్కొన్నారు. పురుషులతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో మహిళలు ప్రతిభను చాటుకుంటున్నారని గుర్తు చేశారు. జనాభాలో సగంగా ఉన్న మహిళలకు అవకాశం ఇస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని అభిప్రాయపడ్డారు. వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. షీ టీమ్స్‌, వృద్ధ, ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌ సహా మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని వెల్లడించారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ ముందంజలో ఉందని వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2021-03-08T08:08:30+05:30 IST