నేడు సద్దుల బతుకమ్మ

ABN , First Publish Date - 2021-10-14T05:30:00+05:30 IST

బతుకమ్మ సంబరాల్లో తొమ్మిదవ, చివరి రోజున ‘పెద్ద బతుకమ్మ’ లేదా ‘సద్దుల బతుకమ్మ’ వేడుకను నిర్వహిస్తారు.

నేడు సద్దుల బతుకమ్మ

తుకమ్మ సంబరాల్లో తొమ్మిదవ, చివరి రోజున ‘పెద్ద బతుకమ్మ’ లేదా ‘సద్దుల బతుకమ్మ’ వేడుకను నిర్వహిస్తారు. అన్నంతో చేసిన రకరకాల పదార్థాలను ఈ రోజు నివేదిస్తారు కాబట్టి గౌరమ్మను ‘సద్దుల బతుకమ్మ’గా వ్యవహరిస్తారు. పెద్ద పళ్ళెంలో గుమ్మడి ఆకులు, రంగులు అద్దిన తంగేడు, గునుగు పూలు, వివిధ ఇతర రకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు. సద్దులను నైవేద్యంగా పెట్టి పూజలు జరుపుతారు. రాత్రి వరకూ ఆటపాటలతో అమ్మవారిని కొలుస్తారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. ఈ రోజు నైవేద్యాల్లో చింతపండు పులిహోర, నువ్వుల అన్నం కొబ్బరి అన్నం, పెరుగన్నం, మలీద ముద్దలు (లడ్డూలు) తదితరాలు ప్రధానంగా ఉంటాయి. కాగా, దుర్గాష్టమి రోజున జరిపే సంప్రదాయం ప్రకారం.... కొన్ని చోట్ల బుధవారం ‘సద్దుల బతుకమ్మ’ను నిర్వహించారు. కానీ తొమ్మిది రోజుల పాటు ఈ సంబరాలను నిర్వహించే ఆనవాయితీ మేరకు చాలా ప్రాంతాల్లో నేడు ఈ వేడుక జరుపుతున్నారు.

Updated Date - 2021-10-14T05:30:00+05:30 IST