నేడే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2020-06-02T10:40:18+05:30 IST

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భవ వేడుకలు మంగళవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం నిరాడంబరంగా

నేడే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఏర్పాట్లను పరిశీలించిన జడ్పీ సీఈవో

ఉమ్మడి జిల్లా కలెక్టరేట్‌లలో ఏర్పాట్లు పూర్తి


ఆదిలాబాద్‌ టౌన్‌, జూన్‌ 1: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భవ వేడుకలు మంగళవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం నిరాడంబరంగా నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో నిబంధనలకు అనుగుణంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా సంబంధిత ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల అధికారులు భౌతిక దూరం పాటించి వేడుకలు నిర్వహించుకోవాలని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని పేర్కొన్నారు.


దీనిలో భాగంగా ఆదిలాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలు ఉదయం 9గంటలకు కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో నిర్వహించనుండగా.. దీనికి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అంతకు ముందు ఉదయం 8.35గంటలకు ఆర్‌అండ్‌బీ అతిథి గృహాం వద్ద ఉన్న ఆదిలాబాద్‌ అమరవీరుల స్థూపం వద్ద ప్రభుత్వ విప్‌ స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఎన్టీఆర్‌చౌక్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పణ చేయనున్నారు. తిరిగి ఉదయం 9.10గంటలకు పోలీసుల గౌరవ వందన స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్‌ సమావేశ మందిరం లో తేనీటి విందులో పాల్గొననున్నారు. ఇందుకు ఈ ఏర్పాట్లను ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద జడ్పీ సీఈవో కిషన్‌ పరిశీలించగా కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో వేడుకలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను సిద్ధం చేసింది.


నిర్మల్‌ కల్చరల్‌: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మంగళవారం నిరాడంబరంగా నిర్వహించేందుకు నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కోవిడ్‌-19 దృశ్యా భౌతికదూరం పాటిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ తెలిపారు. అమరవీరుల స్థూపానికి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం ఉదయం 8గంటలకు కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో పతాకావిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డితో పాటు కలెక్టర్‌ ముషారప్‌ ఆలీ ఫారూఖీ, ఎస్పీ శశిధర్‌, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం, తదితరులు పాల్గొననున్నారు.


తలమడుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్‌ గంగాదర్‌ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఉదయం తహసీల్దార్‌ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు. అదేవిధంగా లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం భౌతిక దూరాన్ని పాటించి, మాస్కులు ధరించి అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరారు.


సిరికొండ: రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం మండలకేంద్రంలో నిర్వహించనున్న వివిధ కార్యక్రమాల్లో ప్రతీఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి రామకృష్ణ కోరారు. ఈ సందర్భంగా మండల పరిషత్‌ కార్యాలయం వద్ద జాతీయ పథాకం ఎగురవేడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి మండలంలోని, అదికారులు, ప్రజాప్రతినిధులు, వివిద పార్టీల నాయకులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


Updated Date - 2020-06-02T10:40:18+05:30 IST