నేడు రెండో వైస్‌ చైర్మన్‌ ఎన్నిక

ABN , First Publish Date - 2021-07-30T05:53:43+05:30 IST

వైసీపీ ప్రభుత్వం నూతనంగా తీసుకొ చ్చిన జీఓ ఆధారంగా మున్సిపల్‌ రెండో వైస్‌ చైర్మన్‌ ఎన్నిక శుక్రవారం జరుగ నుంది.

నేడు రెండో వైస్‌ చైర్మన్‌ ఎన్నిక
హిందూపురం మున్సిపల్‌ కార్యాలయం

సీల్డ్‌ కవర్‌లో పేరు.!     

మారుతిరెడ్డికే దక్కేనా ? 


హిందూపురం టౌన్‌ , జూలై 29 : వైసీపీ ప్రభుత్వం నూతనంగా తీసుకొ చ్చిన జీఓ ఆధారంగా మున్సిపల్‌ రెండో వైస్‌ చైర్మన్‌ ఎన్నిక శుక్రవారం జరుగ నుంది. అయితే గురువారం రాత్రి వరకు మున్సిపల్‌ వైస్‌చెర్మన్‌ ఎవరన్నది ప్రకటించకపోవడంతో అధికార పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మున్సిపల్‌ వైస్‌ చెర్మన్‌గా దాదాపుగా మారుతిరెడ్డి పేరు ఖరారు అయినా... అధిష్టానం శుక్రవారం పంపే సీల్డ్‌ కవర్‌లో పేరు ఎవరిది ఉందోనని టెన్షన్‌ నెలకొంది. రెండో మున్సిపల్‌ చైర్మన్‌ను శుక్రవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ కార్యాలయంలో కౌన్సిలర్లు ఎన్నుకుం టారని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటే శ్వర్‌రావు తెలిపారు. ఈ ఎన్నికకు పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నవీన్‌ ఎన్ని కల అధికారిగా వ్యవహరించనున్నారు. 


విప్‌ జారీ చేయనున్నారు

మున్సిపాల్టీలో అధికార పార్టీకి అత్యధిక మెజార్టీ ఉంది. 38 వార్డులకు గాను 30 మంది వైసీపీ కౌన్సిలర్లు, ఆరుగురు టీడీపీ కౌన్సిలర్లు, ఒక ఎం ఐఎం, ఒక స్వతం త్య్ర అభ్యర్థి ఉన్నారు. స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిచిన కౌన్సిలర్‌ అధికార పార్టీకి చెందిన వాడే. అయి నా సభ్యులకు విప్‌ జారీ చేస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. 


మారుతిరెడ్డికే దక్కేనా?

మునిసిపల్‌ చైర్మన్‌ రేసులో ఉండి ఎన్నికల ఖర్చు కూడా భరించి అన్ని వార్డుల్లో అభ్యర్థుల గెలుపు కోసం ఆర్థిక సాయం  చేసిన మారుతిరెడ్డికి చివరి నిమిషంలో చైర్మన్‌ స్థానం దక్కలేదు. రాజకీయ సమీకరణ నేప థ్యంలో బోయ సమాజిక వర్గానికి చెందిన ఇంద్రజను చైర్మన్‌గా ఎన్ను కున్నారు. అయితే రెండేళ్లుగా మారు తి రెడ్డినే చైర్మన్‌ చేయనున్నట్లు ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ చెప్పుకుం టూ వచ్చారు. కానీ సమీకరణల నేపథ్యంలో చైర్మన్‌ స్థానం మారుతి రెడ్డికి దక్కలేదు. ఈ నేపథ్యంలో రెండో వైస్‌ చైర్మన్‌ మారుతిరెడ్డిని చేస్తామని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం కూడా కౌన్సిలర్లకు మారుతి రెడ్డినే రెండో వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకో వాలని సూచించారు. కానీ కొంత మంది ఆశావహులు ఎమ్మెల్సీ ని కలిసి తమకు అవకాశం కల్పించా లని కోరారు. మారుతిరెడ్డికి మాట ఇచ్చా మని.. మీకు మరో అవకాశం ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తామని సున్నితంగా చెప్పినట్లు తెలిసింది. ఇవన్నీ ఇలా ఉంటే రెండో వైస్‌ చైర్మ న్‌ అభ్యర్థి పేరు అధిష్టానం నుంచి సీల్డ్‌ కవర్‌లో వస్తుందా లేక ఏకగ్రీ వంగా ఇక్కడే ఎన్నుకుంటారా.. అనేది శుక్రవారం తేలనుంది. వైస్‌ చైర్మన్‌ పదవి కోసం ఇద్దరు బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన కొందరు మున్సిపల్‌ కౌన్సిలర్లు పోటీ పడుతు న్నారు. నేటి ఉదయం ఎమ్మెల్సీ నివాసంలో కౌన్సిల ర్లు సమావేశం అవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నిక సందర్భం గా మున్సిపల్‌ కార్యాలయం వద్ద  బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వన్‌ టౌన్‌ సీఐ బాలమద్దిలేటి తెలిపారు.  


Updated Date - 2021-07-30T05:53:43+05:30 IST