Abn logo
Sep 22 2021 @ 22:28PM

టీటీడీ బోర్డు సభ్యుడిగా నేడు కిలివేటి ప్రమాణస్వీకారం

ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

టీటీడీ బోర్డు సభ్యుడిగా

నేడు ఎమ్మెల్యే కిలివేటి ప్రమాణస్వీకారం 

నాయుడుపేట, సెప్టెంబరు 22 : సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. తిరుమలలో జరగనున్న ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. కాగా, 2014లో ఎమ్మెల్యేగా రాజకీయ అరంగేట్రం చేసిన సంజీవయ్య 2019లోనూ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. టీటీడీ సభ్యుడిగా కిలివేటికి సముచిత స్థానం లభించిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రమాణస్వీకారోత్సవానికి నాయుడుపేట నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు.