షో టైమ్‌

ABN , First Publish Date - 2021-07-30T05:04:12+05:30 IST

జిల్లాలో శుక్రవారం నుంచి సినిమా సందడి మొదలు కానుంది. దాదాపు 90 రోజుల విరామం తరువాత వెండితెర రంగులద్దుకోనున్నది.

షో టైమ్‌

 నేడు జిల్లావ్యాప్తంగా 19 ఽథియేటర్లలో సినిమాలు

 రోజుకు మూడు ఆటలే... 50 శాతం సిట్టింగ్‌తో బొమ్మ 


జిల్లాలో శుక్రవారం నుంచి సినిమా సందడి మొదలు కానుంది. దాదాపు 90 రోజుల విరామం తరువాత వెండితెర రంగులద్దుకోనున్నది. ఈనెల 30 నుంచి 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకునేందుకు అవకాశం ఇవ్వడంతో ఎగ్జిబిటర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 92 థియేటర్లు ఉండగా ఇందులో శుక్రవారం 19 థియేటర్లలో మాత్రమే బొమ్మ పడే అవకాశం ఉంది. అది కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్న థియేటర్లలో మాత్రమే.

నరసాపురం, జూలై 29 : ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 శాతం సిట్టిం గ్‌తో రోజుకు మూడు ఆటలు చొప్పున ఽథియేటర్లను నడిపేందుకు కొందరు యజమానులు సిద్ధమవుతున్నారు. కర్ఫ్యూ కారణంగా సెకండ్‌ షో ఉండదు. థియేటర్ల నిర్వాహకులు సినిమా ప్రదర్శనకు ఇప్పటికే సిద్ధం చేశారు. రెండు రోజుల నుంచి పబ్లిసిటీ కూడా మొదలుపెట్టారు. థియేట ర్లను శుభ్రం చేసి శుక్రవారం ఉదయం మొదట ఆట వేసేందుకు రెడీ అవుతున్నారు. సినిమా అభిమానులు చాలా రోజుల తర్వాత థియేటర్లు తెరుచుకోనుండడంతో ఉత్సాహంతో ఉన్నారు. మండల కేంద్రాలు, గ్రామా ల్లోని థియేటర్లల్లో ఇప్పుడప్పుడే షో పడే అవకాశాలు కనిపించడం లేదు. కొత్త సినిమాలు లేకపోవడంతో కొన్ని ఽథియేటర్లనే తొలివిడతగా ప్రారంభిం చాలని నిర్ణయించారు. శుక్రవారం ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూ డెం, కొవ్వూరు, నిడదవోలు, భీమవరం, తణుకు, పాలకొల్లు, నరసాపురం సెంట ర్లలో రెండేసి ఽథియేటర్లలో నేడు బొమ్మ పడనుంది. వచ్చే శుక్రవారం విడుదలయ్యే సినిమాలకు మరికొన్ని థియేటర్లను రెడీ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 92 థియేటర్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఆధునీక రిస్తున్నారు. ఏలూరు, భీమవరం పట్టణాల్లో అత్యధికంగా 22 థియేటర్లు ఉన్నాయి. తణుకులో ఐదు, నరసాపురం మూడు, పాలకొల్లు ఐదు, టీపీ గూడెం ఐదు, జంగారెడ్డిగూడెంలో ఆరు ఽథియేటర్లు ఉన్నాయి. నిడదవోలు, కొవ్వూరులలో కూడా థియేటర్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని థియేటర్లను ఏ, బీ సెంటర్లుగా విభజించారు. ఒక్కో థియేటర్‌లో సగటున పది నుంచి 15 మంది ఉపాధి పొందుతున్నారు. అయితే 16 నెలల నుంచి వీరికి సరైన ఉపాధి లేకపోయింది. గత ఏడాది మార్చి 28 నుంచి డిసెంబర్‌ 25 వరకు థియేటర్లు మూతపడ్డాయి. ఆ తరువాత తెరుచుకున్నా మే 1 నుంచి రెండో విడత వైరస్‌ విజృంభించడంతో మళ్లీ మూసివేశారు. దీంతో ఈ రంగంపైనే ఆధారపడిన వందలాది మంది ఉపాధి కోల్పోయారు. కొవిడ్‌ విజృంభణ తగ్గడంతో ప్రభుత్వం సినిమా ప్రదర్శనకు అనుమతినిచ్చింది.  


సి – సెంటర్లలో ఇప్పట్లో  లేనట్లే


సి – సెంటర్లలో ఇప్పట్లో సినిమాలు వేసేందుకు యజమానులు ఆసక్తి చూపడంలేదు. కొవిడ్‌కు ముందు ప్రభుత్వం సినిమా టిక్కెట్లపై నియం త్రణ పెట్టింది. ఫస్ట్‌ క్లాస్‌ రూ.30, సెకండ్‌ క్లాస్‌ రూ.20, నేల రూ.10 అమ్మా లని ఆదేశించింది. అయితే జిల్లావ్యాప్తంగా మండల, గ్రామాల్లోని ఽథియేటర్లు  ఏసీ హంగులతో ఉన్నాయి.ప్రభుత్వం నిర్ధేశించిన రేట్లకు సినిమా వేస్తే కనీసం కరెంట్‌ ఖర్చులు రావని నిర్వాహకులు ముందుకు రావడం లేదు. 

Updated Date - 2021-07-30T05:04:12+05:30 IST