నేటినుంచి సంక్రాంతి ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2022-01-11T15:33:25+05:30 IST

సంక్రాండి పండుగ కోసం తమ సొంతూళ్ళకు వెళ్ళే వారికోసం ప్రభుత్వ రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను మంగళవారం నుంచి నడుపుతోంది. ఈ బస్సులు స్థానిక కోయంబేడు బస్టాండుతో పాటు నగరంలోని మరో

నేటినుంచి సంక్రాంతి ప్రత్యేక బస్సులు

                - నగరంలో 5 ప్రాంతాల నుంచి ప్రారంభం 


అడయార్‌(చెన్నై): సంక్రాండి పండుగ కోసం తమ సొంతూళ్ళకు వెళ్ళే వారికోసం ప్రభుత్వ రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను మంగళవారం నుంచి నడుపుతోంది. ఈ బస్సులు స్థానిక కోయంబేడు బస్టాండుతో పాటు నగరంలోని మరో నాలుగు ప్రాంతాల నుంచి బయలుదేరుతాయి. ప్రతి రోజూ తిరిగే 2100 బస్సులతో పాటు ప్రత్యేక బస్సులను కలుపుకుని మొత్తం 10300 బస్సులను సంక్రాంతి ప్రత్యేక బస్సుల పేరుతో నడుపుతున్నారు. ఈ బస్సులన్నీ నగరంలోని కోయంబేడుతో పాటు మాధవరం, కేకే నగర్‌, తాంబరం మెప్స్‌ బస్టాండు, తాంబరం రైల్వే స్టేషన్‌, పూందమల్లి బస్టాండు నుంచి బయలుదేరుతాయి. కోయంబేడు బస్టాండు నుంచి దూర ప్రాంతాలైన తూత్తుక్కుడి, కన్నియా కుమారి, తిరుచ్చెందూరు, సెంటోగట్టై, నాగర్‌ కోయిల్‌, మైలాడుదురై, నాగ పట్టణం, మదురై, తిరుచ్చి, సేలం, కోయం బత్తూరు, ఈరోడ్డు, తిరుపూరు, కారైక్కుడి, పుదుక్కోట ప్రాంతాల బస్సులు బయలుదేరుతాయి. ఆంధప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్ళే బస్సులు మాధవరం బస్టాండు నుంచి బయలు దేరుతాయి. సంక్రాంతి తర్వాత వివిధ ప్రాంతాల నుంచి ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు 6468 ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. అయితే, ఈ నెల 16 ఆదివారం కావడంతో ఆ రోజున రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తే బస్సుల రాకపోకలను నిలిపివేస్తారా? లేదా? అనే సందేహం నెలకొనివుంది. ఆ రోజు సంపూర్ణ లాక్‌డౌన్‌ ఉంటే మాత్రం దూరప్రాంతాలకు వెళ్ళిన నగర వాసులు సోమవారం నుంచే చెన్నై తిరిగి రావాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇదిలావుంటే, మంళవారం రోజువారీగా నడిపే 2100 బస్సులతో పాటు 420 ప్రత్యేక బస్సులను నడిపేలా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. 

Updated Date - 2022-01-11T15:33:25+05:30 IST