నేటినుంచి ఎదిర గుట్టల వద్ద సమ్మక్క సారలమ్మ జాతర

ABN , First Publish Date - 2021-02-23T05:34:09+05:30 IST

సమ్మక్క సారలమ్మల జాతర మహోత్సవం చర్ల మండలం ఎదిర గుట్టల వద్ద మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.

నేటినుంచి ఎదిర గుట్టల వద్ద సమ్మక్క సారలమ్మ జాతర
ముస్తాబైన అమ్మవార్ల గద్దెలు

 నాలుగు రోజులు జరగనున్న గిరి’జన’ పండుగ 

  హాజరు కానున్న నాలుగు రాష్ట్రాల భక్తులు 

చర్ల, ఫిబ్రవరి22: సమ్మక్క సారలమ్మల జాతర మహోత్సవం చర్ల మండలం ఎదిర గుట్టల వద్ద మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.  ఈ మహోత్సవానికి ఆలయకమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే జన జాతరకు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర నుంచి సుమారు రెండు లక్షల మంది భక్తులు హాజరు కానున్నారు. జాతర జరిగే నాలుగు రోజుల పాటు ఎదురు గుట్టల జనసంద్రంగా మారనుంది. మేడారం తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న జాతరగా పేరుంది. మంగళవారం సాయంత్రం మండె మెలిగే కార్యక్రమంతో జాతర ప్రారంభం కానుంది.

జాతర జరిగేది ఇలా..

మంగళవారం ప్రారంభమయ్యే జాతర శుక్రవారం సాయంత్రంతో ముగుస్తుంది. మొదటిరోజు మండె వెలుగుటతో జాతర ప్రారంభంమవుతుంది. బుధవారం గుట్ట దేవత సార్మమ్మ గద్దె పైకి వస్తుంది. గురువారం వనదేవత సమ్మక్క గద్దెపైకి వస్తుంది. శుక్రవారం ఇరు దేవతలకు గంగా స్నానం నిర్వహించి గుట్టపైకి చేర్చడంతో జాతర ముగుస్తుంది.

రెండు సంవత్సరాలకు ఒక సారి

 ఎదరు గుట్టల వద్ద ఈ జాతరను రెండు సంవత్సరాలకు ఒక సారి నిర్వహిస్తారు. ఈ జాతరను మినీ మేడారంగా పిలుస్తారు. ములుగు జిల్లా మేడారంలో ప్రధాన జాతర నిర్వహిస్తే ఇక్కడ సుంకు జాతర నిర్వహిస్తారు. సుకుంజాతర మరుసటి సంవత్సరం ఇక్కడ ప్రధాన జాతర నిర్వహిస్తారు. ఎదురగుట్టల వద్ద ఇలా కొన్ని దశాబ్ధాలుగా ఈ జాతరను నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులు జరిగే జాతర మహోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. గద్దెలను సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. భక్తులకు తాగునీటిని సిద్దం చేశారు. చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు. క్యూలైన్లు సిద్దం చేశారు.  

జాతర ప్రారంభం ఇలా...

మొదటిరోజు మండె వెలుగుట కార్యక్రమంతో జాతర మొదలవుతుంది. అంబరాసి బండల వద్ద నున్న ఆలయం నుంచి అమ్మవార్ల  పూజా సామగ్రిని తీసుకుని వస్తారు. ఇదే క్రమంలో శివసత్తులు, భక్తులు పూనకాలతో ఊగి పోతారు. అనంతరం సామాగ్రిని ఎదురుగుట్టల వద్దల వద్ద నున్న గద్దెల వద్ద వాటిని ఏర్పాటు చేస్తారు. మరుసటి రోజు సార్లమ్మ, సమ్మక్క అమ్మవార్లను పూజార్లు గద్దెలకు తీసుకువస్తారు. ఆ సామగ్రితో పూజలు నిర్వహిస్తారు.

Updated Date - 2021-02-23T05:34:09+05:30 IST