నేటి నుంచి సుంకులా పరమేశ్వరి తిరుణాల

ABN , First Publish Date - 2021-04-14T06:26:36+05:30 IST

మండలంలోని కానాల గ్రామంలో వెలసిన సుంకులా పరమేశ్వరి తిరుణాల బుధవారం, గురువారాల్లో వైభవంగా జరగనున్నాయి

నేటి నుంచి సుంకులా పరమేశ్వరి తిరుణాల

సంజామల, ఏప్రిల్‌ 13: మండలంలోని కానాల గ్రామంలో వెలసిన సుంకులా పరమేశ్వరి  తిరుణాల బుధవారం, గురువారాల్లో వైభవంగా జరగనున్నాయి. ఉగాదిని పురస్కరించుకొని మరుసటి రోజు నుంచి రెండు రోజుల పాటు తిరుణాల నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది కరోనా కారణంగా అమ్మవారి తిరుణాల జరగలేదు. ఈ ఏడాది తిరుణాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కూడాల తిమ్మారెడ్డి తెలిపారు. తిరుణాలలో భాగంగా రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 6 పండ్లు, నాలుగు పండ్ల విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. గెలుపొందిన విజేత ఎద్దుల యజమానులకు ప్రథమ బహుమతి రూ.30వేలు, ద్వితీయ బహుమతి రూ.20వేలు, తృతీయ బహుమతి రూ.15వేలు, నాలుగో బహుమతి రూ.10వేలు, ఐదవ బహుమతి రూ.5వేలు, నాలుగు పండ్ల విభాగానికి సంబంధించి మొదటి బహుమతి రూ.25వేలు, ద్వితీయ బహుమతి రూ.20వేలు, మూడో బహుమతి రూ.15వేలు, నాలుగో బహుమతి రూ.10వేలు, ఐదవ బహుమతి రూ.5వేలు, 6వ బహుమతి రూ.3వేలు అందజేస్తామని తెలిపారు.  

Updated Date - 2021-04-14T06:26:36+05:30 IST