నేడు తాంబరం- చెంగల్పట్టు మధ్య కొన్ని రైళ్లు రద్దు

ABN , First Publish Date - 2021-09-01T15:46:10+05:30 IST

రైల్వే మార్గంలో మరమ్మతులు చేపడుతున్న కారణంగా బుధవారం చెన్నై బీచ్‌ నుంచి చెంగల్పట్టు వరకు వెళ్లాల్సిన రైళ్లు తాంబరం వరకే ఆగిపోనున్నాయి. వివరాలిలా వున్నాయి.. ఉదయం 7.50, 9.32, 10.10,

నేడు తాంబరం- చెంగల్పట్టు మధ్య కొన్ని రైళ్లు రద్దు

చెన్నై: రైల్వే మార్గంలో మరమ్మతులు చేపడుతున్న కారణంగా బుధవారం చెన్నై బీచ్‌ నుంచి చెంగల్పట్టు వరకు వెళ్లాల్సిన రైళ్లు తాంబరం వరకే ఆగిపోనున్నాయి. వివరాలిలా వున్నాయి.. ఉదయం 7.50, 9.32, 10.10, 10.56, 11.50, 12.15 గంటలకు చెన్నై బీచ్‌ నుంచి చెంగల్పట్టుకు బయలుదేరే రైళ్లు తాంబరం వరకే వెళ్లి ఆగిపోనున్నాయి. అదే విధంగా ఉదయం 10.30, 9.40, 11.00, 11.30, 12.20 గంటలకు చెంగల్పట్టు నుంచి చెన్నై బీచ్‌ బయలుదేరాల్సిన రైళ్లు రద్దయ్యాయి. ఆ రైళ్లు తాంబరం నుంచి బయలుదేరతాయి. ఇదిలా వుండగా బుధవారం ఉదయం 9.15 గంటలకు కాంచీపురం నుంచి చెన్నై బీచ్‌ బయలుదేరాల్సిన రైలు, ఉదయం 10.40 గంటలకు తిరుమల్‌పూర్‌ నుంచి చెన్నై బీచ్‌ బయలుదేరాల్సిన రైలు పూర్తిగా రద్దయ్యాయి. 


Updated Date - 2021-09-01T15:46:10+05:30 IST