నేడు, రేపు మోస్తరు వర్షాలు

ABN , First Publish Date - 2020-07-05T07:36:44+05:30 IST

రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

నేడు, రేపు మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌, జులై 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. కాగా, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిసా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. 


Updated Date - 2020-07-05T07:36:44+05:30 IST