నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-06-21T05:44:33+05:30 IST

కాకతీయులనాటి శిల్పకళా సౌందర్యంతో ఆధ్యాత్మికంగా, ఆహ్లాదంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రీశుడి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ సోమవారం యాదాద్రికి రానున్నారు.

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

రేపు వాసాలమర్రికి

గ్రామాన్ని సందర్శించిన సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌


యాదాద్రి టౌన్‌, తుర్కపల్లి : కాకతీయులనాటి శిల్పకళా సౌందర్యంతో ఆధ్యాత్మికంగా, ఆహ్లాదంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రీశుడి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ సోమవారం యాదాద్రికి రానున్నారు. సుమారు రూ.1280 కోట్ల అంచనా వ్యయంతో, 2వేల ఎకరాల్లో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు 13సార్లు యాదాద్రిని సందర్శించి పనులను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం 14వ మారు ఇక్కడికి రానున్నారు. చివరి సారిగా మే 4న సీఎం యాదాద్రిని సందర్శించి ఆలయ  పునర్నిర్మాణం, అభివృద్ధి పనులపై పలు సూచనలు చేశారు. వీటి పురోగతిని ప్రస్తుత పర్యటనలో ఆయన పరిశీలించనున్నారు. 22న వాసాలమర్రిలో గ్రామ సభ, సహపంక్తి భోజనాల కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.


యాదాద్రిక్షేత్రాన్ని సీఎం కేసీఆర్‌ సందర్శించనుండటంతో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కొండపైన పడమటి దిశలోని వీవీఐపీ కాటే జ్‌, ప్రధానాలయం, బాలాలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. కొండపైన ఉత్తర దిశలో ల్యాండ్‌స్కేపింగ్‌ గార్డెన్‌లో పూల మొక్కలు నాటారు. బాలాలయం పరిస ర ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. పడమటి దిశలోని లిఫ్టు వద్ద స్వాగతతోరణాన్ని నిర్మిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ యాదాద్రికి చేరుకున్న అనంతరం కొండపైన నూతనంగా నిర్మించిన వీవీఐపీ కాటేజ్‌కు చేరుకుంటారు. ఇక్కడి పరిసరాలను పరిశీలించిన అనంతరం పడమటి దిశలోని లిఫ్టు ద్వారా ప్రధానాలయానికి చేరుకుంటారు. ఆలయ విస్తరణ పనులు, అధునాతన విద్యుద్దీపాలంకరణ ట్రయల్‌ రన్‌ను వీక్షిస్తారు. అనంతరం పనుల పురోగతి, నిర్వహణ తీరుపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం రోడ్డు మార్గంగుండా ఎర్రవెల్లిలోని ఫాంహౌ్‌సకు వెళ్తారని సమాచారం. కాగా, సీఎం పర్యట న నేపథ్యంలో పెద్దగుట్టపై హెలీప్యాడ్‌, సెక్యూరిటీ గార్డ్‌ పాయింట్‌ను అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి ఆదివారం పరిశీలించా రు. ఇదిలా ఉండగా, ప్రధానాలయ అష్టభు జి ప్రాకార మండపాలు, రాజగోపురాలకు విద్యుద్దీపాలంకరణ ట్రయన్‌ రన్‌ను అధికారులు నిర్వహించారు.


వాసాలమర్రిలో మకాంవేసిన యంత్రాంగం

ఈనెల 22న వాసాలమర్రిలో సీఎం పర్యటించనుండటంతో మూడు రోజులుగా అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతుండగా, కలెక్టర్‌ పమే లా సత్పథి పర్యవేక్షిస్తున్నారు. సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంకవర్గీస్‌ వాసాలమర్రిని ఆదివారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి అధికారులు, ప్రజాపత్రినిధులతో సమీక్షించారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎస్సీ హాస్టల్‌ వెనుకవైపు గ్రామసభ, సహపంక్తి భోజనాల కోసం వేర్వేరుగా ఏర్పాటు చేసిన స్థలాలను పరిశీలించారు. భోజనాల కోసం ఏర్పాటు చేసే టేబుళ్ల మధ్య దూరం ఉండేలా చూడాలన్నారు. గ్రామస్థులందరికీ మాస్కులు, శానిటైజర్లు అందజేయాలన్నారు. గ్రామ సభకు కేవలం గ్రామస్థులను మాత్రమే అనుమతించాలన్నారు. సభా వేదికకు ఓ వైపు అధికారులు, మరోవైపు మీడియా ప్రతినిధులు కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.   ఆమె వెంట డీఆర్‌డీఏ ఉపేందర్‌రెడ్డి, ఇతర అధికారులు, సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. కాగా, సీఎం నేరుగా గ్రామ సభా ప్రాంగణానికి కుడి వైపున ఉన్న దేవాలయం పక్కనుంచి వచ్చేలా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 12.30గంటల సమయంలో సహపంక్తి భోజనాల అనంతరం గ్రామసభ ఉండనుంది. సీఎం రోడ్డు మార్గంలో వస్తుండడంతో మండల కేంద్రంలోని భువనగిరి-గజ్వేల్‌ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు.


పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు

సీఎం పర్యటనకు సంబంధించి పర్యవేక్షణ ఏర్పాట్ల కోసం ఆరు కమిటీలను ఏర్పాటు చేయగా ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి ఈ కమిటీలను పర్యవేక్షిస్తున్నారు. స్టేజీ ఇన్‌చార్జి, భోజన ఇన్‌చార్జి, వీఐపీ పార్కింగ్‌, వాటర్‌, విద్యుత్‌ తదితర కమిటీలను ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-06-21T05:44:33+05:30 IST